కొడకండ్ల ఉన్నత పాఠశాల లో సంవత్సరం పొడవున మంచి నీరు ఖర్చులను బరిస్తామన్న1991-92 విద్యార్థులు
కొంత కాలంగా తాగునీటి తో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థులకు మాజీ విద్యార్థులు ఆసరా గా నిలిచి తాగునీటి కొరత ను పరిష్కారించిన సంఘటన కొడకండ్ల మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల జరిగింది
వివరాలిలా ఉన్నాయి ఒకప్పుడు సుమారు వేయి మంది విద్యార్థుల తో చేతి పంపు వాటర్ ట్యాంక్ ప్యూరిపైడ్ వాటర్ ప్లాంట్ తో కళకళలాడిన ఉన్నత పాఠశాల నేడు కేవలం రెండు వందల మంది కే పరిమితం కాగా ఆ కొద్ది మంది కూడా తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థుల విషయం తెలుసుకున్న 1991-92 సంవత్సరం విద్యార్థులు ఏడాది పాటు మినరల్ వాటర్ అందించి ఆయా ఖర్చులను మేమే బరిస్తామని ముందుకొచ్చారు ఈ మేరకు సోమవారం వాటర్ క్యాండ్లు సహితం ఏర్పాటు చేసి తాగునీటిని పాఠశాల ప్రాధనోపాధ్యాయురాలు గ్రేస్ క్రిజీయా రాణి తో ప్రారంభించారు దాంతో ఉపాధ్యాయుల్లో విద్యార్థుల్లో ఆనందం రేకేతింది ఈ కార్యక్రమం లో ఇక్కడె చదివి ఇక్కడనే ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న ఉత్తెపు.వెంకన్న, అందె యాకయ్య, పాము లక్ష్మి నారాయణ, వల్లబోజు విష్ణువర్ధన్, గుండా పూర్ణ చందర్,యాకుబ్ పాష,హాబిబ్,బాస్కర్, సైదమ్మా, ఉమారాణి,రాపోలు నిర్మాల , తదితరులు పాల్గొన్నారు